రోడ్డు ప్రమాదంలో ఇరువురు జూనియర్ ఆర్టీసులతో సహా ముగ్గురు మృతి

0
334

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
శనివారం తెల్లవారు జామున హైదరబాద్ నగరం గచ్చిబౌలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు సినీ జూనియర్ ఆర్టిస్టులతో పాటు కారు డ్రైవర్ మరణించారు. అలాగే మరో జూనియర్ ఆర్టిస్ట్ గాయపడ్డారు.నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టమౌతోంది. అత్యంత వేగంగా కారు దూసుకువెళ్లి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు స్పాట్ లోనే మరణించారు. వీరందరు తెల్లవారు జామున ఎక్కడి నుంచి వెళ్లుతున్నది తెలియడం లేదు. అయితే వీరు అమీర్ పేటలోని ఓ పిజిలో ఉంటున్నట్లు తెలిసింది. ప్రమాదంలో మరణించిన ఇరువురు జానియర్ ఆర్టిస్ట్ లలో ఎం.మానస, ఎన్.మానసలు గాను, డ్రైవర్ అబ్ధుల్ రహీమ్ గా గుర్తించారు.ఇతను యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. గాయపడ్డ మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధుగా గుర్తించి ఇతనని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరు లింగంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంటున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కారులోని నలుగురు ఓ ప్రైండ్ ఇంట్లో రాత్రి వేళ పార్టీ చేసుకొని వెళ్లుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎం.మానసది మహాబూబ్ నగర్ గాను, ఎన్. మానసది కర్నాటకగా గుర్తించారు. ఓ సీరియల్ లో నటించేందుకు వీరిని ప్రమాదంలో గాయపడ్డ సిద్దూ అనే వ్యక్తి హైదరబాద్ కు పిలిపించినట్లు తెలుస్తోంది.https://www.instagram.com/manasa_narayanmurthy/?utm_source=ig_embed&ig_rid=3cc0cfe2-0c2d-4003-89de-4926a31108d3