జంగరెడ్డిగూడెంలో ఘోరం – వాగులోకి బస్సు -10 మంది మృతి

0
213

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో బుధవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం వేలేరుపాడు నుంచి బస్సులో 47 మంది ప్రయాణికులతో జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు ఆనుకొని ఉన్న వంతెన రెయిలింగ్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొని జల్లేరు వాగులో పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఏమి జరుగుతుందో అర్థంకాక చాలా మంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే పురుష ప్రయాణికులు బస్సులో నుంచి భయటపడ్డారు. అధిక మంది మహిళలు బస్సులోనే చిక్కుకొన్నారు. దీంతో బస్సులోని 10 మంది ప్రయాణికులు మృతిచెందారు. మృతులలో అధికంగా మహిళలే ఉండడం విచారకరం.

ప్రమాద సంఘటన జరిగిన వెంటనే రోడ్డు మీద వెళ్లుతున్న వారు అప్రమత్తమై స్థానికులకు సమాచారం అందించగ, పలువురిని రక్షించారు. బస్సులో ప్రయాణికులు ఆత్రుతతో భయటపడడానికి ఆరాటపడడంతో అనేక మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోది,ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వెంటనే స్పందించారు. మృతులకు సంతాపం తెలియచేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతులకు రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించారు. క్షతగాత్రులకు మెరుగైన సహాయం అందించాలని అధికారులకు సి.ఎం. ఆదేశించారు.