ఆ ఒక్కరూ దక్కలేదు…కెప్టన్ వరుణ్ సింగ్ మృతి

0
236

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

డిసెంబర్ 8వ తేదిన ఊటి వద్ద నీలగిరి కొండలలో మిలటరీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో గాయాలతో భయటపడ్డ ఒకే వ్యక్తి కెప్టెన్ వరుణ్ సింగ్ కూడ బుధవారం కన్నుమూశారు. దీంతో హెలికాప్టర్ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు నిలుపుకోలేక పోయారు. తీవ్ర గాయాలతో బాథపడుతున్న వరుణ్ సింగ్ ను బెంగలూరులోని కమాండ్ ఆసుపత్రిలో బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే వైద్యుల ప్రయత్నం ఫలించలేదు. దీంతో చికిత్స పొందుతున్న వరుణ్ బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు అత్యంత ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండాపోయిందని కమాండ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.