Jawad Cyclone: 3 రాష్ట్రాలలో జవాద్ తుఫాన్ హై అలర్ట్

0
163

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
జవాద్ తుఫాన్ నేపథ్యంలో దక్షణాదిలో బంగాళాఖాతం తీరంలోనున్న ఏపి, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో రాబోయే మూడు రోజుల పాటు భారీ, అతిభారి వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను హై అలర్ట్ చేసింది. కేంద్రం ఆయా రాష్ట్రాలను ముందస్తు తుఫాన్ సహాయక చర్యలపై ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాని సైతం దీనిపై సమీక్షించి ఆయా రాష్ట్రాలకు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇందులో భాగం కేంద్రం ఏపి, ఒడిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు 46 ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను పంపింది.

దక్షణ బంగాళాఖాతంలో రాబోయే 12 గంటలలో తీవ్ర వాయుగుండం ఏర్పడి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాతీయ విపత్తు సహాయక బృందాలు అందుబాటులో ఉంచినట్లు ఎన్.డి.ఆర్.ఎఫ్ డైరక్టర్ జనరల్ అతుల్ కార్వల్ తెలిపారు. తుఫాన్ ప్రభావ ప్రాంతాలలో గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీచుతూ శనివారం ఉదయానికి విశాఖ తీరానికి రానున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన రావడంతో ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేశారు. ఇందులో భాగంగా విశాఖ,శ్రీకాకుళం జిల్లాలలో పాఠశాలలకు శుక్ర, శనివారాలలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా వర్షాలు, గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలిపోయే ప్రమాదం ఉన్నదని జాగ్రత్తలు తీసుకోవాలని అంతకు మునుపు ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో డిసెంబర్5వ తేది వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తుఫాన్ బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసింది.

జవాద్ తుఫాన్ ప్రభావంపై భారత వాతావరణ శాఖ విడుదల చేసిన సర్క్యులర్ కాఫి కోసం కింది లింక్ క్లిక్ చేయండి.

https://mausam.imd.gov.in/Forecast/marquee_data/Press%20Release%2003.12.2021%20_2.pdf