Cyclone Jawad: ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన – విశాఖ,శ్రీకాకుళం జిల్లాలలో పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటన

0
147

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
బంగాళా ఖాతంలో అండమాన్ లో ఏర్పడిన జవాద్ తుఫాన్ శుక్రవారం సాయంకాలానికి ఉత్తరాంధ్ర దిశగా పయనించి తీవ్ర వాయుగండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.మరో వైపు ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ జిల్లా కలెక్టర్లు అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా వర్షాలు, గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్థంబాలు కూలిపోయే ప్రమాదం ఉన్నదని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో డిసెంబర్5వ తేది వరకు మత్స్యకారులు సముద్రంలోకి చేేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.