organ transplantation day : అవయవ దానంలో భారత్ 3వ స్థానం – దేశంలో అవయవ దానాలెన్ని..???

0
116

మనఛానల్ న్యూస్ -న్యూస్ డెస్క్
ప్రపంచంలో అవయవ దానాలలో అమెరికా, చైనా తర్వాత భారత దేశం 3వ స్థానంలో నిలిచింది. ఏటా నవంబర్ 27వ తేదీన దేశవ్యాప్తంగా అవయవ దాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2010 నుంచి ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహించి ప్రజలలో చైతన్యానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు అవయవ దానంపై ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు విస్రృతంగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో 12వ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుష్క మాండవ్య మాట్లాడుతూ అవయవ దానం వల్ల ఓ వ్యక్తి మరణిస్తూ కూడ మరో వ్యక్తికి జీవితాన్ని అందిస్తారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అవయవదానంపై ప్రజలలో మరింత అవగాహన తీసుకురావాలని కోరారు.

దేశ వ్యాప్తంగా అవయవదాన కార్యక్రమాలపై ప్రజలలో చైతన్యం పెరగడం మూలంగా అవయవదాతల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2013లో అవయవ మార్పిడిలు 4990 జరగగ, 2019 నాటికి 12746 కి చేరింది. ప్రస్తుతం దేశంలో కిడ్ని, లివర్ వంటి అవయవాల మార్పిడి కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ప్రజలలో మరింత అవగాహన, చైతన్యం వస్తే మరింత మంది ప్రాణాలను రక్షించవచ్చు.