మదనపల్లి మార్కెట్ లో భారీగా పతనమైన టమోట ధరలు – నేడు కిలో ధర కేవలం రూ.50 లోపే..ఎందుకంటే..?

0
298

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
ఏపిలో అతిపెద్ద టమోటా మార్కెట్ కేంద్రం మదనపల్లిలో టమోటా ధరలు గురువారం భారీగా పతనమయ్యాయి. గత 15రోజులుగా కిలో టమోటా ధర రూ100లు పైగా పలకగా బుధవారం వీటి ధరలు తగ్గుముఖం పట్టగా, గురువారం భారీగా పతనమయ్యాయి. గురువారం 10కిలోల ధర రూ.150 నుంచి 450వరకు పలికింది. గత వారంలో భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోవడం, రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో టమోటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.

రాయలసీమ జిల్లాల్లో అధికంగా ఉన్న టమోటా డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని పలువురు వ్యాపారులు చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి 10 లారీల టమోటాలను మదనపల్లి మార్కెట్ కు తీసుకు వచ్చారు. దీంతో స్థానిక రైతుల టమోటా పంటతో పాటు భయట రాష్ట్రాల నుంచి వచ్చిన పంటతో ఒక్కసారిగా ధరలు
భారీగా పతనమయ్యాయి. గురువారం చత్తీస్ ఘడ్ నుంచి వచ్చిన లారీలలోని సరుకు అమ్ముడుపోక వ్యాపారులు నష్టాలు పాలు అయి ఆందోళన చెందుతున్నారు.

గురువారం మదనపల్లిలో టమోటాధరలు పతనంపై మండీ యజమానుల సంఘం అధ్యక్షుడు కె.వి.ఆర్ మనఛానల్.ఇన్ ప్రతినిధితో ఏమన్నారంటే…

https://www.facebook.com/amar.natahreddy/posts/4664083960316960?cft[0]=AZVUgLm7TgKFHcjBzPdiWDuQs45qOQqFYt6cKQ5xrVeUkhK9Ss0b0zTOHuy5GM9Z0wKCQkvWX0ixTAzqEdGFmNf-yfNnn1SP8mpZ9h7zh3VFVyPladR1hKaTcHkwzvAAg2k&tn=%2CO%2CP-R

https://www.facebook.com/100001462075318/videos/pcb.4664083960316960/591155465526725?cft[0]=AZW6p5VVogvzRvtP2eWhZNkp0mJfwsDI2H0XOnkHqdIwNdt-o_jqiDjtho_fpnzqRd6a8FFQ0vF9N2hKdVKE-oBc6e72RoATQtJovPk7BfZHBBpFMpV1JMoMow4XEsywz3A&tn=*bH-R

https://www.facebook.com/watch/?v=591155465526725&cft[0]=AZXN4iTOqo20ao4w2QowOAmgrifHthhKCkCnT8uho-4nniUkzGw60Heg606qF9HryJOjJYx0BxCGpZ0WC7sDRhbVKAD3lCN3NPHNdYEwG8-1vXLuga-TesuyLdtaGH8zvYwv8mMBXCScfF2Ki3XDRmF1&cft[1]=AZX2Wp6XIlU93vbN-uxkUVUPk_Q81f9Mb8cMjWs8gMDJuhrLHwbX6CTo5nMEy9Z1CDfMprQzQrukQPJw5mHJzOdf7ILnxyPsgG8GNb7BtWpzuF4LYBSZEueL92Vpni1e9SlNarpWDfG57Cl3sTKg8_vcPV1UZtXJYoi7FBf8MoYbQQ&tn=F-R