గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్ సి.ఇ.ఓ ఎ.కె.రావు దారుణ హత్య

0
134

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ హరిణి తండ్రి, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజన చౌదరికి చెందిన సుజన ఫౌండేషన్ సంస్థ సి.ఇ.ఓ ఎ.కె.రావు బెంగళూరులో గురువారం దారుణ హత్యకు గురయ్యారు. హరిణి కుటుంబం హైదరబాద్ లో కాపురం ఉంది. వారం రోజులుగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి బెంగళూరు వెళ్లినట్లు తెలిసింది.

అనంతరం హరిణి తండ్రి ఎ.కె.రావు ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆయన బెంగుళూర్ లో రైల్వే ట్రాక్ పై శవం అయి కనిపించారు. రైల్వే పోలీసులు శవాన్ని పోస్టు మార్టానికి పంపారు. శవంపై గాయాలు ఉండడంతో ఆయన హత్యకు గురైనట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సింగర్ హరిణి