మనచానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
OLA : ఏపిలో ఓలా ఎస్1 (OLAS1) ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ 2వ వారం వరకు వేగవంతం చేస్తోంది. ఇప్పుటికే తమ వద్ద రూ.499లు చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసిన కస్టమర్ల కోసం టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నవంబర్ 10 నుంచి 19వతేది వరకు దేశంలో ప్రధాన నగరాలలో పూర్తి చేసింది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 3 వరకు దేశ వ్యాప్తంగా మరో 12 నగరాలలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
డిసెంబర్ 4 నుంచి 15వరకు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రధాన పట్టణాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని 1000 పైగ పట్టణాలలో ఓలా టెస్ట్ డ్రైవ్ కు మహూర్తం నిర్ణయించింది. ఓలా ఎస్1 (OLAS1) స్కూటర్ కొనుగోలు ఆసక్తితో రూ.499లు
చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ చేసిన వారు ఆయా రోజులలో తమకు సమీపంలోని పట్టణాలలో వారికి కేటాయించే స్లాట్ల టైమింగ్ లో ఓలా ఎస్1 టెస్ట్ డ్రైవ్ కు హాజరు కావాలని సంస్థ వర్తమానం పంపింది. 2022 జనవరి నుంచి అమ్మకాలు ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 4 నుంచి 15వరకు ఓలా స్కూటర్ టెస్ట్ డ్రైవ్ జరిగే పట్టణాలు ఇవే…
అడ్డాడ, అద్దంకి, ఆకివీడు, అక్కంపేట, అమలాపురం, అంబకపల్లె, అనంతపురం, అనపర్తి, అన్నవరప్పాడు, అనుగొండ, అత్తిలి, బాపట్ల, భీమవరం, బిక్కవోలు, బొబ్బిలి, చెర్లోపల్లె, చీరాల, చిత్తూరు, దర్శి, ధర్మవరం, ఈరవరం గొల్లపూడి, ద్వారకా గొల్లపూడి , గుండుగొలను, గుంతకల్లు, హిందూపూర్, జగ్గయ్యపేట, జమ్మలమడుగు, జట్లపాలెం, కడప, కదిరి, కడియం, కైకలూరు, కాకినాడ, కంచరపాలెం, కందుకూరు, కనిగిరి, కంతేరు, కాపవరం, కావలి, కోడూరు, కోరుకొల్లు, కుప్పలు, కొత్తూరు, కొత్తూరు, కొత్తూరు , మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె, మలికిపురం, మండపేట, మారుటేరు, నగరి, నందికొట్కూరు, నంద్యాల, నరసన్నపేట, నరసాపురం, నరసరావుపేట, నర్సీపట్నం, నాయుడుపేట, నెల్లూరు, నిడదవోలు, ఒంగోలు, పాలకొల్లు, పామూరు, పురుద్దాపురం, పామూరు , పీలేరు, పిఠాపురం, పొదిలి, పొన్నూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, రామచంద్రపురం, రాపూరు, రావులపాలెం, రాయచోటి, రాజంపేట, రాజోలు, రేణిగుంట, సామర్లకోట, సింగరాయకొండ, శ్రీకాకుళం, శ్రీకాళహస్ టి, తాడేపల్లెగూడెం, టంగుటూరు, తణుకు, తిరుపతి, తుని, ఉదయగిరి, ఉంగుటూరు, వడ్డంగి, వెంకటగిరి, వింజమూరు & వినుకొండ