TSRTC : ఆర్.టి.సి బస్సులపై ప్రైవేటు ప్రకటనలు నిషేధం

0
147

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
TSRTC : తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ ఇక నుంచి తమ సంస్థల బస్సులపై ప్రైవేటు ప్రకటనలను నిషేదించాలని నిర్ణయించారు. వీటి వల్ల సంస్థకు ఆదాయం కంటే బస్సులు అపరిశుభ్రంగా మారుతున్నాయని, అలాగే ప్రకటనలలో అతికించే చిత్రాలు మహిళలు చూడడానికే అసభ్యకరంగాను, అభ్యంతరకరంగాను ఉన్నాయనే ఫిర్యాదులు రావడంతో తెలంగాణా ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. టి.ఎస్.ఆర్.టి.సికి(TSRTC )ఈ ప్రకటనల ద్వారా ఏటా రూ.20 కోట్ల ఆదాయం సమకూరేది. అయితే సంస్థ ఆదాయం కన్నా సమాజ ప్రయోజనాలే ముఖ్యంగా యజమాన్యం భావించి ఈ నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ బస్సుల ప్రకటనల కోసం స్టిక్కర్ ప్లెక్సిీలను బస్సులపై అంటించేవారు. దీనికి ఉండే గమ్ము బస్సులకు అలాగే ఉండి అపరిశుభ్రమయ్యేవి. ఈనేపథ్యంలో బస్సులపై ప్రకటనలను నిషేధించాలని నిర్ణయించారు. దీని వల్ల వచ్చే నష్టాన్ని మరో మార్గంలో పూడ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బస్సులపై పోస్టర్లు, స్టిక్కర్లు నిషేదం – అతిక్రమిస్తే జరిమానా
తెలంగాణ ఆర్టీసీ బస్సులపై స్టిక్కర్లు, పోస్టర్లు అంటించడాన్ని నిషేధించినట్లు ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ తెలిపారు. ఏవరైన దీనిని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. దీనిపై ఆయా డిపో మేనజర్లకు బాధ్యతలు అప్పజెప్పుతూ ఆదేశాలు ఇచ్చారు. ఆర్టీసీ ఎం.డి. ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు ఉపక్రమించారు.