మదనపల్లిలో ఉదృతంగా ప్రవహిస్తోన్నబాహుదా నది

0
1075

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం మధ్యలో ఉన్న బాహుదా నది బుధవారం తెల్లవారు జాము నుంచి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ – సి.టి.ఎం రోడ్డు లో రాకపోకలు ఆపివేశారు. స్థానికులను ఆ మార్గంవైపు వెళ్లకుండ మున్సిపల్ సిబ్బందిని, పోలీసులను పహరా గా నియమించారు. మదనపల్లి మున్సిపల్ కమీషనర్ ఉదయం ఆప్రాంతంలో ఉండి పరిస్థితిని సమీక్షించారు. మదనపల్లి రూరల్ మండలం, రామసముద్రం మండలం, కర్నాటక ప్రాంతంలో ఇప్పటికే చెరువులు,కుంటలు నిండడంతో ఆప్రాంతంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు భారిగా వరద నీరు బాహుదా నదిలో ప్రవహాస్తోంది. మరో వైపు నిమ్మనపల్లి బాహుదా ప్రాజెక్టు గేట్లు గత 4 రోజుల నుంచి ఎత్తివేశారు.

https://www.facebook.com/100001462075318/videos/1291201744725553/

https://www.facebook.com/100001462075318/videos/1291201744725553/