ఇ.సి.గంగిరెడ్డి ప్రథమ వర్థంతి సభలో పాల్గోన్న సి.ఎం.వై.ఎస్.జగన్

0
103

మనఛానల్ న్యూస్ – పులివెందుల
ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఆదివారం స్వస్థలం పులివెందులలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన తన సొంత మామ (భార్య భారతి తండ్రి) ఇ.సి.గంగిరెడ్డి ప్రథమ వర్థంతి సంస్మరణ సభలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఇ.సి. గంగిరెడ్డి పులివెందులలో స్థానికులకు చేసిన అందించిన సేవలను పలువురు బంధుమిత్రులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాల్గోన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ తన మామ గంగిరెడ్డిపై ప్రచురించిన పుస్తకాన్ని తొలుత ఆవిష్కరించారు. అనంతరం ఇ.సి.గంగిరెడ్డి వ్యక్తిత్వతం ఆయన అందరికి ప్రాయుడుగా వర్ణించారు. అంతకుమునుపు ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు.