ముగిసిన నాగచైతన్య-సమంతల వైవాహిక జీవితం – విడాకుల ప్రకటన విడుదల

0
138

మనఛానల్ న్యూస్ – సినిమాడెస్క్
టాలీవుడ్ లో అత్యంత వైభవంగా సాగిన అక్కినేని నాగచైతన్య- సమంతల వివాహం శనివారం విడాకులతో ముగిసింది. 2010లో విడుదలైన ‘ఏమాయ చేశావే’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించినప్పటి నుంచి వీరి మధ్య తొలి పరిచయంతో ప్రేమ మెుదలై.. 2017 అక్టోబర్ 6వ తేదీన గోవాలో వీరు హిందు, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడం వరకు చేరింది. కేవలం నాలుగేండ్ల లోపే నాగచైతన్య-సమంతల పెండ్లి పెటాకులు అయింది. వీరి మధ్య పొరపొచ్చలు వచ్చాయని విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు అన్ని మీడియాలలో బలంగా వినిపించాయి.చివరికి వారే స్వయంగా తాము విడిపోతున్నట్లు వేర్వేరుగా ప్రకటించి ఉహాగానాలకు తెరదీశారు. అక్కినేని నాగచైతన్య- సమంతల విడాకులపై నాగ చైతన్య తండ్రి నాగార్జున స్పందించారు. ఈ జంట విడాకులు తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు.
సమంత స్పందనలో ఆవేదన
తాము విడాకులు బాధతో తీసుకొంటున్నట్లు నటి సమంత తన ట్వీట్టర్ లో వెల్లడించింది. ఆమె ఏమన్నరంటే…నేనుబాధ.. నిస్పృహలో ఉన్నప్పుడు ఒక విషయం తెలిసింది.ఏన్నటికైన చివరికి ప్రేమే గెలుస్తుందనేది వాస్తవం. అయితే కొందరు ద్రోహులు, దుర్మార్గులు, హంతకుల , నియంతలు ఉంటారు..వెన్నుపోటు పొడుస్తారు. ఏది కనబడకుండా కుట్ర చేయడంలో వాళ్లు చాలా నిపుణులు.చివరకు వాళ్లు సర్వనాశనం కావడం ఖాయం. ఇది చరిత్ర చెప్పే వాస్తవం… ఇదే విషయాన్నినాకు మా అమ్మ ఎప్పుడో చెప్పింది. నాగ చైతన్యను కొందరి మాయ మాటలు నమ్మి నన్ను అర్థం చేసుకోకుండ విడాకులు ఇచ్చారనే విషయం సమంత ఆవేదనలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తమ సంసార జీవితంలో తెలియని కొందరు నిప్పులు పోశారని..వారు నాశనం అవుతారని సమంత శపించినట్లు శపించింది..

విడాకులు పునర్జన్మలాంటిది- రాంగోంపాల్ వర్మ
నాగఛైతన్య-సమంతల విడాకులపై తెలుగు సినిమా పరిశ్రమ నుంచి తొలిసారిగా రాంగోపాల్ వర్మ వివాదస్పదంగా తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందించారు. పెళ్లిళ్లు కాదు…విడాకులు వేడుకగా జరుపుకోమని సూచించారు. పెళ్లి చావులాంటిదని, విడాకులు పునర్జన్మ లాంటిదని అన్నారు.