భారత్ లో నేడు 28వేలు కేసులు – 373 మరణాలు – 97.45 % రికవరీలు

0
109

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
భారత్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. మంగళవారం ఉదయానికి దేశంలో 28,204 కరోనా పాజిటివ్ కేసులు, 373 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 147 రోజుల నాటి స్థాయికి చేరింది. రికవరీ రేటు కూడ గణనీయంగా పెరిగింది. గత 10రోజుల వరకు 97.35 మరకు ఉన్న రికవరీ రేటు నేడు 97.45శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య3,88,508 గా ఉంది. నిన్న ఒక్కరోజే దేశంలో 15.11 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో నేటి వరకు జరిగిన శాంపిల్స్ పరీక్షల సంఖ్య 48.32 కోట్లు, ఇది ఇలా ఉండగా కరోనా నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్ కు వచ్చే డైరక్ట్ విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేదం పొడిగించింది.