సోమవారం ప్రధాన వార్తలు @ manachannel.in

0
128


మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

 • -ట్యోక్యో ఒలింపిక్స్ లో వివిధ క్రీడలలో పాల్గోని స్వదేశానికి చేరుకొన్న క్రీడాకారులకు స్పోర్టు అథారిటి ఆఫ్ ఇండియా సోమవారం ఘనస్వాగతం పలికింది. ఈ మేరకు ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు, క్రీడాభిమానులతో ఢిల్లీ విమానాశ్రయం నిండిపోయింది.
 • పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద భారత ప్రధాని నరేంద్రమోది దేశంలోని 9.75 కోట్ల మంది రైతులకు రూ.19500 కోట్ల రూపాయిలను వారి ఖాతాలకు సోమవారం జమ చేశారు.1.57 లక్షల కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.
 • అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజుకి వందల్లో నమోదు అవుతున్న కేసుల సంఖ్య గత వారం రోజులుగా రోజుకి లక్ష కేసులు నమోదు అవుతుండడంతో అమెరికాలో ఆందోళన పరిస్థితి నెలకొంది. దీంతో ఐసియూ ల కొరత ఏర్పడింది. అత్యవసర కేసుల సంఖ్య పెరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం అందుకొంది. డెల్టా వేరియంట్ ప్రభావం వల్ల దేశంలో కరోనా ఉదృతి అధికమౌతోంది.
 • లోకసభ లో సోమవారం ఒబిసి బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి 15 విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్రాలకు అప్పజెప్పే 127వ రాజ్యంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తామని విపక్ష పార్టీలు వెల్లడించాయి.
 • చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కన్యాకపురంలో సోమ వారం ఉదయం కంకర అన్ లోడ్ చేస్తున్న టిప్పర్ కు ప్రమాదావశత్తు విద్యుత్ తీగలు తగలడంతో ట్రిప్పర్ డ్రైవర్ తో పాటు ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడి మరణించారు.
 • ఏపిలో పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇచ్చే కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభించినట్లు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు తమ ధరఖాస్తులను అన్ లైన్ లో నింపి, ఆయా స్కూలు హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ చేత అటెస్ట్ చేసి అందచేయాలని సూచించారు.
 • తెలంగాణా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నజస్టిస్ కేశవరావు అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఈయన వయసు 60 సంవత్సరాలు. హైకోర్టు జడ్డీ మరణంతో తెలంగాణాలో సోమవారం కోర్టులకు శెలవు ప్రకటించారు.
 • కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్‌ చానల్‌ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న సస్పెండెడ్ కానిస్టేబుల్, అతడి సోదరుడిపై తీవ్ర మైన చర్యలు తీసుకొంటామని జిల్లా ఎస్.పి సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.
 • విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 13న వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక.. వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపికను అందిస్తారు. ఆరు కేటగిరీల్లో పురస్కారాలు ప్రదానం చేస్తామని నిర్వహకులు తెలిపారు.
 • అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ ప్రధాన మంత్రి నరేంద్రమోదిని
  సోమ వారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా అస్సాం-మిజోరామ్ రాష్ట్రాల సరిహద్దు వివాదం గురించి ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు.

ట్యోక్యో ఒలింపిక్స్ లో వివిధ క్రీడలలో పాల్గోని స్వదేశానికి చేరుకొన్న క్రీడాకారులకు స్పోర్టు అథారిటి ఆఫ్ ఇండియా సోమవారం ఘనస్వాగతం పలికింది. ఈ మేరకు ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ప్రతినిధులతో పాటు, క్రీడాభిమానులతో ఢిల్లీ విమానాశ్రయం నిండిపోయింది.