పోలీసు చేతిలో జర్నలిస్ట్ హత్య – డిజిపి సీరియస్

0
178

మనఛానల్ న్యూస్ – అమరావతి
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో మట్కా ,జూదం లాంటి అసాంఘిక శక్తులతో కలిసి పనిచేస్తున్న పోలీసు కానిస్టేబుల్ వ్యవహారాన్ని భయటపెట్టిన ఓ యూట్యూబ్ ఛానల్ విలేఖరిని పోలీసు కానిస్టేబుల్ మరియు అతని సోదరుడు కిరాతంగా హత్య చేసిన కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న పోలీసు కానిస్టేబుల్ వ్యవహారంపై ఏపి డిజిపి గౌతమ్ సావంగ్ సీరియస్ అయ్యారు. ఇలాంటి సంఘటనల వల్ల పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని భావించిన డిజిపి ఈ కేసును నేరుగా విచారించి తక్షణమే నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా ఎస్.పి సుధీర్ కుమార్ రెడ్డిని సోమవారం ఆదేశించారు. ఈ మేరకు సదరు కానిస్టేబుల్ ను వెంకటసుబ్బయ్యను సస్పెండ్ చేశారు. ఇతనితో పాటు ఈ హత్యలో ప్రధాన పాత్రదారి అయిన కానిస్టేబుల్ సోదరుడు నాని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
హత్య జరిగిన విధానం ఇదే..
నంద్యాల పట్టణంలో వెంకటసుబ్బయ్య అనే కానిస్టేబుల్ మట్కా ఆడేవారితో కుమ్మక్కు అయి ఇతర అసాంఘిక కార్యకలపాలు జరుపుతున్నట్లు ఆధారాలతో వి6 అనే యూట్యూబ్ ఛానల్ విలేఖరి కేశవ్ ఓ కథనాన్ని అందించారు. దీంతో కర్నూలు పోలీసు అధికారులు వెంకటసుబ్బయ్యను విధులనుంచి తప్పించారు. దీనిని మనసులో పెట్టుకొని ఉన్న సుబ్బయ్య, ఆయన సోదరుడితో కలిసి విలేఖరి కేశవ్ ను హత్య చేయాలని భావించారు. ఈ మేరకు ఆదివారం కేశవ్ తన సహా ఉద్యోగి ప్రతాప్ తో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్లుతుండగా సుబ్బయ్య ఆయన సోదరుడు వారిని ఆపి, సహోద్యోగి ప్రతాప్ ని అక్కడే ఉండమని, కేశవ్ తో మాట్లాడాలని ఓ రూమ్ లోకి తీసుకేళ్లారు. తమ వద్ద ఉన్న స్కూడ్రైవర్ తో కేశవ్ శరీరంపై ఎనిమిది సార్లు పొడిచారు. కేశవ్ కేకలు విన్న సహాద్యోగి ప్రతాప్ వెళ్లి చూడగ కేశవ్ అప్పటికే కొన ఊపిరితో, రక్తపు గాయాలతో కనిపించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగ, కేశవ్ అప్పటికి మరణించినట్లు పోలీసులు దృవీకరించారు.