ఏపిలో భారిగా తగ్గిన కరోనా – 1413 కేసులు నమోదు

0
132

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గాయి. సోమవారం ఉదయానికి రాష్ట్ర వ్యాప్తంగా 1413 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇందులో తూర్పుగోదావరిలో అత్యధికంగా 458కేసులు నమోదు కాగ, నెల్లూరు జిల్లాలో 207కేసులు, చిత్తూరు జిల్లాలో 201కేసులు, కృష్ణా జిల్లాలో 113 కేసులు నమోదు అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కేసులు 100లోపు మాత్రమే నమోదు అయ్యాయి. విజయనగరం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అయితే 20లోపు కేసులు ఉండడం విశేషం. గత 24 గంటలలో రాష్ట్రంలో 54455 మందికి పరీక్షలు నిర్వహించారు. మరణాల విషయానికి వస్తే 18 మంది కరోనా తో గత 24 గంటలలో మరణించారు.