టిటిడి ఛైర్మన్ గా వై.వి సుబ్బారెడ్డి నియామకం

0
233

మనఛానల్ న్యూస్ – అమరావతి
తిరుమల- తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా వై.వి.సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుటికే ఒక మారు ఆ పదవిని చేపట్టిన సుబ్బారెడ్డిని మరో మారు నియమించారు. వై.వి.సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కు స్వయాన చిన్నాన్న. ఈసారి టిటిడి ఛైర్మన్ పదవిని మాజీ ఎం.పి మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో సుబ్బారెడ్డి పదవి కాలం పూర్తి అయిన వెంటనే ఆ పదవిలో ఏవరిని నియమించలేదు. తప్పనిసరి పరిస్థితులలో సుబ్బారెడ్డికి మరో అవకాశం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈయన మరో రెండేళ్లు పాటు పదవిలో కొనసాగుతున్నారు. బోర్డు సభ్యుల నియామకం చేపట్టాల్సి ఉంది.