ట్యోక్యో ఒలింపిక్స్ లో భారతీయ బంగారు కొండ నీరజ్ చోప్రా

0
458

మనఛానల్ న్యూస్ – స్పోర్టు డెస్క్
ట్యోక్యో ఒలింపిక్స్ లో భారతీయ జెండా రెపరెపలాడింది. జావిలిన్ త్రో లో భారతీయ క్రీడాకారుడు నీరవ్ చోప్రా అద్భుత ప్రతిభ కనబర్చి శనివారం బంగారు పతాకాన్ని గెలిచి అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తిని నిలబెట్టారు. స్వర్ణం కోసం అర్రులు చాచి ఎదురుచూస్తోన్న క్రీడాభిమానులకు శనివారం ఆనందకర వార్తను అందించి ఉపశమనం కల్గించారు. భారత్ ట్యోక్యో ఒలింపిక్స్ లో ఒక స్వర్ణం, రెండు రజితాలు, 4 కాంస్యాలు సాధించింది. జావిలిత్రో లో భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా అద్భుతం ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకొన్నారు. 100 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున అథ్లెటిక్స్‌ ఫీల్డ్‌ అండ్‌ ట్రాక్‌ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్‌ చోప్రా చరిత్రలోకెక్కాడు. గతంలో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో అభివన్‌ బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించారు.హర్యానాకు చెందిన నీరజ్‌ చోప్రా పానిపట్‌ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24న జన్మించాడు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో సుబేదార్ గా పనిచేస్తున్నారు. నీరవ్ చోప్రా విజయం దేశాన్ని సంబరంలో ముంచింది. ఇండియన్ ఆర్మీ జవానులు
ఘనంగా విజయోత్సోవాన్ని జరుపుకొన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి,ప్రధాని, ప్రతిపక్షనేతలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు , ముఖ్యమంత్రులు నీరవ్ చోప్రాను అభినందించారు.