ఒలింపిక్స్ లో భారత్ కు కుస్తీలో కాంస్యం

0
568

మనఛానల్ న్యూస్ – స్పోర్ట్సు డెస్క్
భారత్ ట్యోక్యో ఒలింపిక్స్ లో అదరగొట్టుతోంది. భారతీయ క్రీడాకారులు రోజు తమ క్రీడారంగంలో శక్తి వంచన లేకుండా పోరాడుతూ ఏదోక పతకాన్ని దేశానికి అందించి అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తిని నిలబెడుతున్నారు. జావిలిన్ త్రో విభాగంలో బంగారు పతకాన్ని సాధించడంతో పాటు నేడు కుస్తీ (రెజ్లింగ్ లో) శనివారం కాంస్య పతకాన్ని బజరంగ్ పూనియా సాధించి పెట్టారు. రెజ్లింగ్‌ లో 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతకం కోసం కజకిస్తాన్‌ ఆటగాడు దౌల‌త్ నియాజ్‌బెకోవ్‌ ను 8-0 తేడాతో చిత్తుగా ఓడించి కాంస్య పతకం సాధించారు.దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా నిలిచాడు.