కేరళలో, మహారాష్ట్రలో కరోనా ఉదృతి – దేశంలో 44వేల కేసులు – 464 మరణాలు

0
140

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
దేశంలో కరోనా ఉదృతి మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్రలో రోజురోజుకి కేసుల సంఖ్య అధికమౌతుండడంతో మిగిలిన రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. శుక్రవారం ఉదయానికి దేశంలో 44643 కేసులు నమోదు కాగ, కేరళలో 22వేలు, మహారాష్ట్రలో 9 వేల చొప్పున కేసులు నమోదు అయి, దేశం మెుత్తం కేసులలో 69శాతం కేసులు ఆరాష్ట్రాలలో ఉండడం విశేషం. దేశ వ్యాప్తంగా గత 24 గంటలలో కరోనా బారిన పడి 464 మంది మరణించారు. రికవరీ రేటు 0.01శాతం తగ్గి 97.36 శాతానికి చేరింది. రోజు వారి పాజిటివ్ రేటు 11 రోజులుగా 3శాతం లోపే కొనసాగుతోంది. శుక్రవారం ఉదయానికి దేశంలో రోజువారి పాజిటివ్ రేటు 2.72గా నమోదు అయింది. వారపు పాజిటివ్ రేటు 2.41 శాతంగా నమోదు అయింది. దేశంలో గత 24 గంటలలో 41096 మంది రికవరీ అయ్యారు. నేటివరకు 47.65 కోట్ల శాంపిల్స్ టెస్టింగ్ చేయడం జరిగింది. అలాగే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ ఒక్కరోజే దేశంలో దాదాపు 58 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించి దేశంలో మెుత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 50 కోట్లకు చేరువు అయింది.