మనఛానల్ న్యూస్ – స్పోర్ట్సు డెస్క్
ట్యోక్యో ఒలింపిక్స్ లో భారత్ మరో మారు విజయకేతనం ఎగరేసింది. దీంతో మరో కాంస్య పతకం మన వశం అయింది. పురుషుల హాకీలో భారత్ కు కాంస్యం లభించింది. ట్యోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు ఇది నాల్గవ పతకం. నేటివరకు ఒక రజతం,మూడు కాంస్య పతకాలు భారత్ కు దగ్గాయి. రాబోయే రోజులలో మరిన్నీ పతకాలు లభిస్తాయని దేశంలోని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్‌లో జర్మనీ-భారత్ మధ్య కాంస్యం కోసం పోరు జరిగింది. ఈపోరులో భారత్ 5-4 తేడాతో జర్మనీని ఓడించి కాంస్య పతకాన్ని అందుకొంది. 41 సంవత్సరాల అనంతరం మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ పురుషుల హాకీ టీం ఈ అద్బుత విజయం సాధించింది.