ఒలింపిక్స్ లో భారత్ మహిళ బాక్సర్ లవ్లీనాకు కాంస్యం

0
109

మనఛానల్ న్యూస్ – స్పోర్ట్సు డెస్క్
ట్యోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు మహిళ బాక్సింగ్ లో కాంస్యం లభించింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా అద్భుత ప్రతిభ కనబర్చి భారత్ కు మరో కాంస్యాన్ని తీసుకొస్తోంది. ట్యోక్యో ఒలంపిక్స్ లో భారత్ నేటి వరకు మూడు పతకాలను సాధించింది. వెయిట్‌ లిఫ్టర్‌ మీరాభాయి చాను మహిళల 49కిలోల విభాగంలో ఒలింపిక్స్ లో భారత్ తరపున తొలిసారిగా రజత పతకం గెలుచుకోగ, బ్యాట్మింటిన్ లో తెలుగు అమ్మాయి పి.పి సింధు కాంస్య పతకం, నేడు లవ్లీనా బాక్సింగ్ లో మరో కాంస్యాన్ని గెలిచి భారత్ జెండాను ట్యోక్సో ఒలింపిక్స్ లో రెపరెపలాడించింది. ఈ వారంలో భారత్ కి మరిన్నీ పతకాలు రానున్నాయని భారత్ క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు.