కూతురి పెళ్లి కోసం మనవడిని చంపేసిన అవ్వ…!! తప్పక క్లిక్ చేసి చదవండి.

0
202

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్
ఇద్దురు పిల్లలున్న కూతురికి పెండ్లి చేసేందుకు అడ్డుగా మారిన మనమడిని హతం చేసిన అమ్మమ్మ క్రైమ్ కథనం ఇది….వివరాలు కోసం ఇక చదవండి..
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పిట్లం కు చెందిన ఓ వివాహిత తనభర్త రెండేళ్ల క్రితం మరణించడంతో పిల్లలతో కలిసి సంగారెడ్డి టౌన్ లో రాజంపేట వద్ద కాపురం ఉంటోంది. ఈమెకు ఇరువురు పిల్లలు ఉన్నారు. పెద్ద పిల్లోడికి 5 ఏళ్లు, చిన్న పిల్లవాడికి రెండేళ్ల లోపు వయసు ఉంటుంది.వీరితో పాటు వివాహిత తల్లి నాగమణి కూడ కలిసి ఉంటోంది. వివాహిత మహిళ తన భర్త చనిపోవడంతో పుల్కల్ మండలం బద్రీగూడెంకు చెందిన జనార్థన్ అనే వ్యక్తి తో స్నేహాం ఏర్పడింది. దీంతో రోజు జనార్థన్ ఇంటికి వస్తుండడంతో తన కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం కన్నా పెళ్లి చేసుకోమని నాగమణి జనార్థన్ ను నిలదీసింది. ఇరువురు పిల్లలు ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని చిన్నపిల్ల వాడిని చంపివేస్తే మీ కుమార్తె ను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదని జనార్థన్ చెప్పడంతో …నాగమణిని తన చిన్న మనవడిని చంపడానికి ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని కూతురికి తెలియనీకుండా జాగ్రత్తలు తీసుకొంది. జనార్థన్ చెప్పినట్లు చేస్తే తన కుమార్తెకు మళ్లీ పెళ్లి చేయవచ్చునని నాగమణి భావించి…చిన్న మనవడిని తీసుకొని కొత్త బస్టాండ్ వరకు ఆటోలో వెళ్లి అక్కడ నుంచి రాజీవ్ పార్క్ కు చేరుకొని సమీపంలోని బొగ్గులకుంటలో మనవడిని విసిరేసేసింది. తిరిగి ఇంటికి చేరుకొని చిన్న మనవడిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ.. డ్రామా ఆడి పోలీసులకు నాగమణే ఫిర్యాదు చేసింది. పోలీసు స్టేషన్ లో రోదనలు చేస్తూ హంగామా చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, తమ పద్దతిలో విచారణ ప్రారంభించడంతో అసలు విషయాన్ని నాగమణే భయట పెట్టింది. తన కుమార్తెను జనార్థన్ కు ఇచ్చి పెళ్లి చేసేందుకే తాను తన మనవడిని చంపానని చెప్పడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కూతురు పెళ్లి కోసం పసిబిడ్డను బలిచేసిన అమానవీయ అవ్వ కు జైలు తప్పదేమో…