ఏపిలో స్థిరంగా కరోనా కేసులు – నేడు 78,992 శాంపిల్స్ పరీక్షలు – 2058 కేసులు

0
130

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,992 సాంపిల్స్ పరీక్షించగ, 2,058 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య శాఖ వెల్లడించింది. శుక్రవారం కంటే శనివారం పాజిటివ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం నాడు 2,068 నమోదవగా శనివారం 2,058 పాజిటివ్‌
కేసులు తేలాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 364 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,66,175 మంది కరోనా బారిన పడ్డారు. ఇక తాజాగా గడిచిన ఒక్క రోజులో 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తంగా రికవరీల సంఖ్య 19,31,618 లకు చేరింది రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 2.6 శాతం ఉంది. మరణాల శాతం 0.68% గాను, రికవరీ రేటు 98.2% శాతంగాను నమోదు అయింది. జిల్లాల వారిగా చూస్తే …అనంతపురం – 47, చిత్తూరు – 284, తూర్పు గోదావరి – 364, గుంటూరు – 182, కడప – 140, కృష్ణా – 325, కర్నూలు – 11, నెల్లూరు – 173, ప్రకాశం 242, శ్రీకాకుళం – 45, విశాఖపట్నం 89, విజయనగరం – 29, పశ్చిమ గోదావరి – 127 చొప్పున జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తగ్గిన ప్రభుత్వ పర్యవేక్షణ
ఏపిలో కరోనా కేసులు తగ్గుతున్న కొద్ది ప్రభుత్వ యంత్రాంగం తమ రెగ్యులర్ పనిలో నిమగ్నమౌతోంది. దీంతో భవిష్యత్ లో మళ్లీ కరోనా ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.దుకాణాలు, సినిమాహాళ్లు, హోటళ్లు, టీ దుకాణాలు,సంతలు, మార్కెట్లు, పెళ్లిళ్లు, బస్టాండ్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, పంక్షన్ హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా రిజిష్ట్రేషన్ కార్యలయాలు మెుదలైన జనసంచా రం అధికంగా ఉన్న ప్రాంతాలలో 70 శాతం ప్రజలుమాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. దీంతో మళ్లీ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, సామాజిక దూరంపై జనాలలో చైతన్యం తీసుకురావడం, దీని ఆవశ్యకతను ప్రజలకు వివరించడం, పాటించని వారిపై జరిమానాల కొరడ ఝుళిపిస్తే గాని పరిస్థితులు చక్కబడేలా లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత కాలం టీమ్ లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బెంగళూరులో కార్పోరేషన్ మాస్క్ వినియోగం పై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఏపిలో అన్ని ప్రాంతాలలో అదే విధానం తీసుకొస్తే మరో ముప్పు నివారించవచ్చువని విశ్లేషిస్తున్నారు.