అదమరిస్తే తప్పదు మరో కరోనా ముప్పు…! ఏపిలో గాలిలో కోవిడ్ సడలింపు నిబంధనలు ….!!

0
176

మనఛానల్ న్యూస్ – స్పెషల్ డెస్క్
ఏపిలో కరోనా కేసులు సంఖ్య 2వేలకు, అలాగే శాంపిల్స్ పరీక్షలు రోజుకి 50 వేలకు తగ్గడం లేదు. అన్ లాక్ అనంతరం జనం మనకు కరోనా ముప్పు తప్పిందనే ఆనందంలో ఇబ్బడిముబ్బడిగా తిరిగేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు అమలు మాత్రం అధ్వానంగా కనిపిస్తోంది .రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మాత్రం కోవిడ్ సడలింపు నిబంధనలు అమలులో కేవలం వాహనదారుల పైనే అధిక సమయం పర్యవేక్షిస్తూ కేసులు రాస్తున్నారు గాని, జన సముహాల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వ్యక్తికి ఎవరికైనా రూ.100లు జరిమానా విధించమని ఆదేశించింది. పోలీసులు మాత్రం కేవలం వాహనదారులను మాత్రమే టార్గెట్ చేయడం విమర్శలు పాలు చేస్తోంది. స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు తమ పరిధులలో కోవిడ్ నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. ఏపిలో చాలా చోట్ల ఈ విషయాన్ని పట్టించుకొనే నాథుడే కనిపించడం లేదు. పర్యావసానంగా జనం ఇష్టారాజ్యంగా తిరుగుతూ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
ఏపిలో కరోనా కేసులు తగ్గుతున్న కొద్ది ప్రభుత్వ యంత్రాంగం తమ రెగ్యులర్ పనిలో నిమగ్నమౌతోంది. కోవిడ్ సడలింపు నిబంధనలు గురించి ఆలోచించడం లేదు. దీంతో భవిష్యత్ లో మళ్లీ కరోనా ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా దుకాణాలు, సినిమాహాళ్లు, హోటళ్లు, టీ దుకాణాలు,సంతలు, మార్కెట్లు, పెళ్లిళ్లు, బస్టాండ్లు, బస్సులు, రైల్వే స్టేషన్లు, పంక్షన్ హాళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా రిజిష్ట్రేషన్ కార్యాలయాలు మెుదలైన జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో 70 శాతం ప్రజలు మాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగించడం, సామాజిక దూరం పాటించడం లాంటి కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. దీంతో మళ్లీ కరోనా ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, సామాజిక దూరంపై జనాలలో చైతన్యం తీసుకురావడం, దీని ఆవశ్యకతను ప్రజలకు వివరించడం, పాటించని వారిపై జరిమానాల కొరడ ఝుళిపిస్తే గాని పరిస్థితులు చక్కబడేలా లేవు. ఇందుకోసం ప్రత్యేకంగా కొంత కాలం పాటు స్థానిక సంస్థలు తమ ఉద్యోగులు, స్వచ్ఛంధ సంస్థల సహాకారంతో టీమ్ లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బెంగళూరులో మున్సిపల్ కార్పోరేషన్ మాస్క్ వినియోగం పై కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న మాదరిగానే ఏపిలో అన్ని ప్రాంతాలలో అదే విధానం తీసుకొస్తే మరో ముప్పు నివారించవచ్చువని విశ్లేషిస్తున్నారు.దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేసి భవిష్యత్ లో ఏపికి కరోనా ముప్పు తప్పేలా చూస్తుందని ఆశిద్దాం…ఈ విషయంలో జనం సైతం కాస్త మెలుకువుగా ఉంటేనా మరో ముప్పు రాకపోవచ్చు.