తెలంగాణాలో బిజెపికి షాకిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి …

0
189


మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణాలో పార్టీ ఫిరాయింపుల సందడి పెరుగుతోంది. మాజీ మంత్రి
ఈటెల రాజేందర్ టి.ఆర్.సికి రాజీనామా చేసి బిజెపిలోకి చేరడంతో ఉషారుగా ఉన్న ఆపార్టీకి… ఆయన రాకను జీర్ణించుకోలేని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోమవారం బిజెపికి గుడ్ బై చెప్పి పెద్ద షాకిచ్చారు.ఈటెల రాజేందర్ వచ్చిన ఆనందం పెద్దిరెడ్డి పోకతో ఎంతో కాలం నిలవలేదు. తెలంగాణలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు ఒకోక్కోరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా హుజూరాబాద్‌లో కీలక నేత, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్‌బై చెప్పడానికి ప్రధాన కారణం ఈటెలను తమను సంప్రదించకుండ పార్టీలోకి తీసుకోన్నారని కినుక వహించి ఈ నిర్ణయం తీసుకొన్నారు. పెద్దిరెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిక దగ్గరి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో తాజా పరిస్థితులపై నియోజకవర్గంలో చర్చించి పార్టీకి రాజీనామా చేశారు సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గతంలో ప్రాతినిథ్యం వహించాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు.మెున్నటి వరకు వలసలతో కళకలలాడిన బిజెపి కార్యాలయం తిరోగమన వలసలతో అధినాయకత్వం తలపట్టుకొంటోంది. 2024 ఎన్నికల వరకు పార్టీని ఉత్తేజపర్చడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో నాయకులకు అర్థం కావడం లేదు.