అనారోగ్యంతో ప్రముఖ సినీనటి జయంతి మృతి

0
190

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
దక్షణాది సినిమా రంగంలో అత్యంత పేరు ప్రఖాత్యలు
సంపాదించుకున్న ప్రముఖ సినీ నటి జయంతి సోమవారం ఉదయం బెంగుళూరులో ఆమె నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. . ఆమె అసలు పేరు కమల కుమారి. ఈమె 1949 జనవరి6వ తేదీన బాలసుబ్రమణ్యం, సంతానలక్ష్మీ దంపతులకు . చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీరంగంలో రాజ్‌కుమార్‌కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు. జయంతి తండ్రి బాలసుబ్రమణ్యం స్వస్థలం శ్రీకాళహస్తి అయినప్పుటికి బెంగళూరులో సెయింట్ జోసఫ్ కాలేజీలో ఇంగ్లీషు లెక్టరర్ గా పనిచేసేవారు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో జయంతి తల్లి వద్ద పెరిగారు.తల్లితో కలిసి మద్రాసు కు చేరిన జయంతి నాట్యం నేర్చుకొంది. అనంతరం తెలుగు, కన్నడ,తమిళ , మరాఠి, హింది సినిమాలలో నటించింది. తెలుగులో ఎన్.టి.ఆర్ తో కలిసి జగదేకవీరుని కథ కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలలో వంటి సినిమాలలో నటించింది.ఆమె రాజకీయాలలో ప్రవేశించి చికమంగళూర్ లో ఎం.పి స్థానానికి, కోరటిగెరి ఎం.ఎల్.ఓ పదవికి పోటి చేసి ఓడిపోయింది.