నారప్ప సినిమా లో వెంకటేష్ నటనపై చిరంజీవి హట్ కామెంట్….!! చూడాలంటే క్లిక్ చేయండి.!

0
143

మనఛానల్ న్యూస్ – సినిమా డెస్క్
అమెజాన్ ప్రైమ్ లో జులై20వ తేదీన విడుదలై సంచనం సృష్టించిన విక్టరీ వెంకటేష్ సినిమా నారప్ప పై సర్వత్ర ప్రశంసలు ఏదుర్కొంటున్న తరుణంలో టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి చేసిన ప్రశంసలు నారప్పకు మరింత బూస్టర్ ఇచ్చినట్లు అయిందని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. . కోలీవుడ్ లో అద్భుత విజయం సాధించిన అసురన్‌కి రీమేక్‌ గా వచ్చిన నారప్ప తెలుగు లో సైతం ఎంతో ఆదరణ పొందుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ నటన కు ఆయన అభిమానులే కాక, నెట్ జన్లు సైతం ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉందని అభిమానులు పండగ చేసుకుంటుండడమే గాక, మరోవైపు విమర్శకులను నుంచి సైతం నారప్పకు మంచి ప్రశంసలు లభించాయి. ఓటీటీలో విడుదలైన చిత్రాల జాబితాలో మంచి బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నారప్ప నిలిచిపోతోందని సినిమా విమర్శకులు అంటున్నారు. ఈతరుణంలో తాజాగా ఈ చిత్రం చూసిన మెగాస్టార్ చిరంజీవి నారప్ప సినిమాపై స్పందించారు. వెంకటేష్ గారు కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నాకు నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు. మెగాస్టార్ ఈ హాట్ టాక్ వెంకీ అభిమానులు మంచి టానిక్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా మరో అద్భుతం సృష్టించే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.