జులై26 నుంచి బెంగళూరులో కాలేజీల పునఃప్రారంభం

0
72

మనఛానల్ న్యూస్ – బెంగళూరు
కర్నాటకలో కరోనా తర్వాత కాలేజీల పునఃప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 26(సోమవారం) నుంచి పలు కాలేజీల యాజమాన్యాలు ఇందుకు సన్నద్ధం అవుతున్నాయి. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకొన్న విద్యార్థులకు కాలేజీకి హాజరు కావచ్చునని ఆయా సంస్థలు ప్రకటించాయి. వివిధ కాలేజీలు తమ విద్యార్థుల వ్యాక్సినేషన్ కు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పుటికే దీనిపై ప్రచారం నిర్వహించాయి. బెంగళూరు సిటి యూనివర్సిటి సోమవారం నుంచి కాలేజీ ప్రారంభిస్తోంది. త్వరలో తరగతులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసింది. తమ కాలేజీకి చెందిన విద్యార్థులలో 75 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకొన్నట్లు యూనివర్సిటి వి.సి తెలిపారు. క్యాంపస్ లో మాస్క్, శానిటైజర్., సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. దీనిపై మోటివేషన్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వారు తెలియచేశారు.
.