
మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5.10 లక్షల మంది ఉన్నారు.సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని మంత్రి వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫలితాల వెల్లడికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు ఆధారంగా ఫలితాలు విడుదల చేశామని మంత్రి అన్నారు. థియరీ పేపర్ మార్కుల కోసం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల నుంచి 70 శాతం వేయిటేజ్, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్‌గా తీసుకొనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలకు విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకొని ఫలితాలు విడుదల చేశామని మంత్రి తెలిపారు.
ఫలితాల కోసం కింది లింక్ లను క్లిక్ చేయండి.