ఏపిలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

0
163

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపిలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం చేయాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అమరావతి ఏపి సి.ఎం.వై.ఎస్.జగన్ విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. అందులో భాగంగా పాఠశాలల అభివృద్ధికి చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో అవకతవకలు జరగకుండ చూడాలని, మెుదటి విడత నాడు నేడు కార్యక్రమాన్ని ప్రజలకు అంకితం చేసి, రెండ విడత నాడు- నేడు కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను సి.ఎం. ఆదేశించారు.నూతన విద్యా విధానం విధి, విధానాలపై ఆగష్టు 16నే ప్రకటన చేయలాని సి.ఎం. అధికారులకు సూచించారు.

నూచన విద్యా విధానంలో తీసుకొచ్చే మార్పులు సంక్షిప్తంగా…

 • కొత్త విద్యావిధానంలో పీపీ–1 నుంచి 12వ తరగతి వరకూ ఆరు రకాల స్కూల్స్‌
 • శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ ( పీపీ–1, పీపీ–2)
 • పౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)
 • పౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5 తరగతులు)
 • ప్రీహైస్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు)
 • హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకూ)
 • హైస్కూల్‌ ప్లస్‌ ( 3 నుంచి 12వ తరగతి వరకూ) రానున్నాయి.
  పౌండేషన్‌ స్కూళ్లలో భాగంగా అంగన్‌ వాడీల నుంచే ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుంది
 • శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌గా అంగన్‌వాడీలు రూపాంతరం చెందుతాయి
 • శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌కు ఫౌండేషన్‌స్కూల్స్‌ మార్గనిర్దేశకత్వం వహిస్తాయి
 • ఈ స్థాయిలో పాఠశాలలను ఎస్‌జీటీ టీచర్లు పర్యవేక్షణచేస్తారు, ఉత్తమ బోధన అందేలా చూస్తారు
 • శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్‌ ప్రతి ఆవాసంలో ఉంటుంది.
 • కిలోమీటరు లోపలే పౌండేషన్‌ స్కూల్‌ ఏర్పాటవుతుంది
 • మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్‌ ఉంటుంది
 • మూడు కిలోమీటర్ల పరిధి దాటి ఒక్క స్కూలూ ఉండదు
  వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటు చేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తారు.