పోలీస్ కంట్రోల్ రూమ్ లోనే హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

0
224

మనఛానల్ న్యూస్ – కడప
విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ తాను పనిచేస్తున్న స్థలంలోనే ప్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కడప పట్టణంలో సంచలనంగా మారింది. కడప పట్టణంలో కోర్టు ఆవరణంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహించే విజయ్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్ మంగళవారం రాత్రి విధులు నిర్వహించడానికి వచ్చారు. అయితే రాత్రంతా విధులలో ఉన్న ఆయన తెల్లవారే సమయానికి (బుధవారం) ప్యాన్ కు ఉరేసుకొన్నారు. విషయాన్ని గుర్తించిన తోటి పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ అనారోగ్యంతో బాథపడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.