సి.ఎం.వై.ఎస్.జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

0
82

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి సి.ఎం. వై.ఎస్.జగన్ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం అనేవి బక్రీద్ పండుగ సందేశాలని సి.ఎం. అన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం వై.ఎస్. జగన్‌ ఆకాంక్షించారు.దేవుని ఆశీస్సులు అందరికి ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి జగన్ అభిలషించారు.