జులై 23 నుంచి తెలంగాణలో సినిమా థియోటర్లు ప్రారంభం

0
126

మనఛానల్ న్యూస్ – హైదరబాద్
తెలంగాణాలో సినిమా బొమ్మ వచ్చే వారం నుంచి థియోటర్లలలో కనిపించబోతోంది. ఈమేరకు శనివారం రాష్ట్ర సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ తో తెలంగాణ ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించి సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం జులై 23 నుంచి సినిమా థియోటర్లు ప్రారంభించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. 100 శాతం ఆక్యుపెన్సీవ్ తో సినిమా థియోటర్లు ఓపెన్ చేస్తారు. కోవిడ్ నిబందనలు ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23 తర్వాత తెలుగులో పలు సినిమా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా టక్ బాలాజీ, తిమ్మరసు సినిమాలు ఈ నెల చివరి నాటికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.