ఈ రోజుల వార్తలు @ manachannel.in

0
350


మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

 • భౌద్దమత గురువు టిబెట్ కు చెందిన దలైలామా భారత ప్రధాని నరేంద్రమోదిని త్వరలో కలుసుకోవాలని ఉన్నారని టిబెట్ ప్రభుత్వం అధ్యక్షుడు పెన్ప టిసెరింగ్ తెలిపారు.
 • దేశంలో గురువారం ఉదయానికి నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 38792, మరణాలు 624 , పాజిటివ్ రేటు 97.28 శాతం
 • కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఫించన్ దారులకు డి.ఏ ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచింది.
 • రాజ్యసభ లో లీడర్ ఆఫ్ హౌస్ గా ఫియూష్ గోయల్ ను నియమించారు.
 • కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ తీరుతో ఏపికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ గురువారం ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
 • జుమూటో పుడ్ డెలవరీ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది. రూ.71.92 కోట్ల నిధుల సేకరణకు ఉద్దేశించిన ఈ పబ్లిక్ ఇష్యూలో తొలిరోజు 36 శాతం షేర్లకు దరఖాస్తులు అందాయి. షేర్ ధర రూ.72-76 మధ్య నిర్ణయించనున్నారు.
 • మధ్యప్రదేశ్ లో జులై25 నుంచి 50 శాతం విద్యార్థులతో ఇంటర్ తరగతులు నిర్వహించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
 • పద్మ అవార్డులకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో నామనేషన్లు ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్ 15,2021వరకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. వెబ్ సైట్ చిరునామా http://Padmaawards.gov.in
 • జులై19 నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో జులై18న బిజెపి పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నారు. అదే రోజు ఎన్.డి.ఏ మిత్రపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు.
 • జులై22న భారతీయ కిసాన్ యూనియన్ రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ పార్లమెంటు ముందు నిరసన వ్యక్తం చేయనున్నట్లు రైతు నాయకుడు రాకేష్ తికాయిత్ తెలిపారు.
 • పశ్చిమ బెంగాల్ లోని నందిగామ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రీకౌంటింగ్ చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ ను కలకత్తా హైకోర్టు ఆగస్టు 12వ తేదీకి వాయిదా వేసింది.
 • పాకిస్తాన్ లో జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 13 మంది మరణించారు. అందులో 9 మంది చైనా దేశీయులు, ఇరువురు పాకిస్తాన్ జవానులు ఉన్నారు. ఈ ప్రమాదం దాసు ప్రాంతంలో జరిగింది.
 • ప్రధాని నరేంద్ర మోది మరియు మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మాద్ సోలీలు గురువారం టెలిఫోన్ లో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కోవిడ్ నివారణకు భారత్ అందిస్తున్న సహాయాన్ని మాల్దీవులు అధ్యక్షుడు గుర్తు చేసి కృతజ్ఞతలు తెలిపారు.