లగ్జరీ కారుకు పన్ను మినహాయింపు కోరిన తమిళ హీరో – ఫైన్ వేసిన హైకోర్టు

0
194

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
తన విలాసవంతపు వాహనానికి పన్ను మినహాయింపు అడిగిన తమిళ హీరో కు లక్ష రూపాయిలు జరిమానా ను నజరాగా ఇచ్చింది మద్రాస్ హైకోర్టు..
తమిళ సినిమాలలో హీరో గా మంచి స్టార్ డమ్ సాధించిన హీరో విజయ్ దళపతికి మద్రాసు హైకోర్టు జరిమానాతో షాకిచ్చింది. ఏకంగా లక్ష రూపాయాల జరిమానా విధించి సదరు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయక నిధికి విరాళంగా జమచేసి చూపాలని ఆదేశించింది. దీంతో నటుడు ఉలిక్కిపడ్డాడు. ముందే విలాస జీవనం…ఆపై అందుకు వినియోగిస్తున్న వాహనంపై దిగుమతి పన్ను మినహాయింపు కోరడమేమమిటని కోర్టు ప్రశ్నించింది.. కోట్లాది రూపాయిలు ఆర్జించే కొందరు స్టార్ హీరోలు పన్ను చెల్లించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది…ఒకింత ఆశ్ఛర్యాన్ని వ్యక్తం చేసింది.

తమిళ్ హీరో విజయ్ దళపతికి కార్లు కొనడం హాబీ…అందులోను పాత కాలపు వాహనాలతోపాటు.. బీఎమ్‏డబ్ల్యూ మినీ కాపర్, టయోటా ఇన్నోవా, ఆడి ఎ8, రోల్స్ రాయిస్ ఘెస్ట్ వంటి కార్లు ఇప్పుటికే కొనుగోలు చేసి తన వద్ద ఉంచుకొన్నారు. తాజాగా విజయ్ ఇంగ్లండ్‌ నుంచి రోల్స్‌ రాయిస్‌ను దిగుమతి చేసుకున్నాడు. సంబంధిత కారును దిగుమతి చేసుకున్నందుకు గానూ… పన్ను మినహాయింపు కోరుతూ విజయ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసి. ఇంతవరకు ఆ కారుకు పన్ను కట్టనందుకు రూ. లక్ష జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించి ఝలక్ ఇచ్చింది…