కేంద్రానికి తగ్గిన జి.ఎస్.టి ఆదాయం

0
550

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ప్రతి నెల లక్ష కోట్ల పైబడి ఉన్న వసూలు అయ్యే జి.ఎస్.టి ఆదాయం జూన్ నెలలో 92 కోట్లు మాత్రమే వసూలు అయింది. దీంతో ప్రభుత్వ ఆదాయం 2 తగ్గింది. జూన్ నెలలో జి.ఎస్.టి కింద రూ. 92,849 కోట్లు వసూలు కాగ, కేంద్రం వాటా కింద రూ.16,424 కోట్లు, రాష్ట్రాల వాటా కింద రూ. 20,397 కోట్లు, సమ్మిళిత జి.ఎస్.టి కింద రూ.49079 కోట్లు వసూలు అయింది. సెస్ కింద రూ.6949 కోట్లు వసూలు అయినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.