Today Top News @ Manachannel.in

0
112

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

  • దేశీయ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోపీలను నవంబర్ 16, 2021 నుంచి ఫిబ్రవరి29,2022వరకు నిర్వహిస్తామని బిసిసిఐ శనివారం వెల్లడించింది. ఇందులో భాగంగా 2127 మ్యాచ్ లు నిర్వహిస్తామని వెల్లడించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫి మ్యాచ్ లు సెప్టెంబర్ 21న ప్రారంభించి, ఫైనల్స్ ను నవంబర్12, 2021న, విజయ్ హజారే ట్రోఫి మ్యాచ్ లు ఫిబ్రవరి 23, 2022న ప్రారంభించి ఫైనల్స్ ని మార్చి 26, 2022న నిర్వహించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.
  • దేశంలో కరోనా టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు పి.ఎం. కేర్ ఫండ్ నుంచి రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
  • కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, వారిలో ఉహించని విధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతోందని జెనివా యూనివర్సిటి చేసిన అధ్యయనంలో వెల్లడి అయింది.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సి.బి.ఎస్.ఇ) దేశంలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి సరికొత్త పథకాన్ని ఇన్నోవేషన్ అంబాసడర్ ప్రొగ్రామ్ పేరిట శనివారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రాల్ ప్రారంభించారు. జులై 16 నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. దీనిని కేంద్ర విద్యాశాఖ, ఎ.ఐ.సి.టి.ఇలు సహాకారంతో దేశ వ్యాప్తంగా 50 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో పాల్గోనే ఉపాధ్యాయుల వివరాలను జులై10వ తేదిలోపు వెబ్ సైట్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
  • కర్నాటకలో నిర్మించదలపెట్టిన మేకదాతు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్డ్యూరప్ప శనివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కు లేఖ రాశారు. దీని వల్ల రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొంటూ..ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించు కొందామని కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 4 టి.ఎం.సి.ల నీరు నిల్వ చేసి బెంగుళూరు నగరానికి తాగునీరు,ఇతర అవసరాలకు మరియు తమిళనాడు రైతులకు సాగునీరు అందించవచ్చునని కర్నాటక సి.ఎం. తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్టుపై 400 మెగవాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు.
  • దేశంలో గత మూడు సంవత్సరాలుగా కుక్కకాటు లేని రాష్ట్రంగా 3వ సారి
    గోవా రాష్ట్రం నమోదు అయింది. 2019 మరియు 2020, 2021 లో రాష్ట్రంలో ఎక్కడ కుక్కకాటు (రేబిస్) కేసు నమోదు కానందున గోవాను రేబిస్ ప్రీ స్టేట్ గా గుర్తించారు.
  • దేశీయంగా తయారై వ్యాక్సిన్లను కరోనా అత్యవసర పరిస్థితులలో వినియోగించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది. దీని ద్వారా కోవాగ్జిన్ లాంటి వ్యాక్సిన్లకు భవిష్యత్ లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.