మదనపల్లి పోలీసుల విజ్ఞప్తి

0
239

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లి పట్టణంలోని ప్రజలు తాము నివాసం ఉంటున్న ఇళ్ల విషయంలో దొంగల బెడద నుంచి కాపాడుకోవడానికి మదనపల్లి పోలీసులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. పట్టణంలో నివాసం ఉంటున్న వారు తాము ఇతర ప్రాంతాలకు వెళ్లెటప్పుడు పోలీసులకు తగు సమాచారం ఇచ్చి వెళ్లాలని కోరుతున్నారు. దీనివల్ల ఆ ఇళ్లలో దొంగతనాలు జరగకుండ తాము నిఘా ఉంచుతామని పోలీసులు తెలిచేస్తున్నారు. ఇళ్ల లో కాపురము ఉంటున్నవారు ఎల్.హెచ్.ఎం.ఎస్ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకోని, దీని ద్వారా పని చేసే కెమెరాల కోసం తమను సంప్రదించాలని వారు కోరారు. ఈ యాప్ దొంగలను గుర్తించేదికాదని, పట్టించేదని పోలీసులు అంటున్నారు. ఇతర ప్రాంతాలకు ఇళ్లు తాళం వేసుకొని పోయేవారు ఇళ్లలో విలువైన బంగారు నగలు, నగదు లను ఉంచి వెళ్లరాదని పోలీసులు కోరుతున్నారు. అలాగే పట్టణంలోని ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు యు టైపు ఫోక్స్ లాక్స్ ఉయోగించుకోవాలని సూచించారు. దీనివల్ల వాహనాల దొంగ తనాలు తగ్గుతాయని వారు పోలీసులు తెలిపారు. పట్టణంలోని అపార్టుమెంట్లు, కాలనీలలో జీవించే వారు కూడళ్లలో సి.సి. కెమెరాలను అమర్చుకోవాలని, పట్టణంలో ఎవరైనా అపరిచితులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు 9908899617 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. కరోనా దృష్టా ప్రతి ఒక్కరు మాస్క్ దరించడం, సామాజిక దూరం పాటించడం, వాహనాలలో వెళ్లే వారు మాస్క్ తప్పక ధరించి నిబంధనలకు అనుగుణంగా పరిమితంగా ప్రయాణించాలని కోరారు.