మదనపల్లి తాజా వార్తల కోసం క్లిక్ చేయండి

0
240

మదనపల్లిలో ఎం.పి మిథున్ రెడ్డి పర్యటన
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
రాజంపేట ఎం.పి మిథున్ రెడ్డి సోమవారం ఉదయం మదనపల్లి మండలంలో పర్యటించారు. కోళ్లబైలు పంచాయతీ కాట్లాటవారిపల్లి మార్గంలో చేనేత కార్మీకుల కోసం నిర్మిస్తున్న చేనేత భవనాన్ని ఎం.పి.ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పి మిథున్ రెడ్డి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ ప్రభుత్వం బి.సి ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎం.ఎల్.ఎ నవాజ్ బాష, తంభళ్లపల్లి ఎం.ఎల్.ఎ పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి, స్థానిక నాయకులు ఉదయకుమార్, అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

మదనపల్లిలో రెండవ విడత కరోనా మందు
పంపిణికిఎ.పి.ఎస్.యు.ఎఫ్ చురుకుగా ఏర్పాట్లు
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లి పట్టణానికి చెందిన ఎ.పి.ఎస్.యు.ఎఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా నివారణకు ఆనందయ్య మందు తరహా కరోనా మందుకు మంచి స్పందన రావడంతో రెండవ విడత మందు పంపిణికి చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా ఉంటున్న ప్రముఖ ఆయుర్వేద వైద్యుని పర్యవేక్షణలో ఈ మందు తయారు చేస్తున్నారు. దీనికి అవసరమైన మూలికల సేకరణ వేగంగా జరుగుతోంది. రెండవ విడత గా కరోనా మందును మదనపల్లి పట్టణంలో అందిస్తామని ఎ.పి.ఎస్.యు.ఎఫ్ నిర్వహకులు వెల్లడించాారు.

మదనపల్లి పోలీసుల విజ్ఞప్తి
మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లి పట్టణంలోని ప్రజలు తాము నివాసం ఉంటున్న ఇళ్ల విషయంలో దొంగల బెడద నుంచి కాపాడుకోవడానికి మదనపల్లి పోలీసులు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. పట్టణంలో నివాసం ఉంటున్న వారు తాము ఇతర ప్రాంతాలకు వెళ్లెటప్పుడు పోలీసులకు తగు సమాచారం ఇచ్చి వెళ్లాలని కోరుతున్నారు. దీనివల్ల ఆ ఇళ్లలో దొంగతనాలు జరగకుండ తాము నిఘా ఉంచుతామని పోలీసులు తెలిచేస్తున్నారు. ఇళ్ల లో కాపురము ఉంటున్నవారు ఎల్.హెచ్.ఎం.ఎస్ అనే యాప్ డౌన్ లోడ్ చేసుకోని, దీని ద్వారా పని చేసే కెమెరాల కోసం తమను సంప్రదించాలని వారు కోరారు. ఈ యాప్ దొంగలను గుర్తించేదికాదని, పట్టించేదని పోలీసులు అంటున్నారు. ఇతర ప్రాంతాలకు ఇళ్లు తాళం వేసుకొని పోయేవారు ఇళ్లలో విలువైన బంగారు నగలు, నగదు లను ఉంచి వెళ్లరాదని పోలీసులు కోరుతున్నారు. అలాగే పట్టణంలోని ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు యు టైపు ఫోక్స్ లాక్స్ ఉయోగించుకోవాలని సూచించారు. దీనివల్ల వాహనాల దొంగ తనాలు తగ్గుతాయని వారు పోలీసులు తెలిపారు. పట్టణంలోని అపార్టుమెంట్లు, కాలనీలలో జీవించే వారు కూడళ్లలో సి.సి. కెమెరాలను అమర్చుకోవాలని, పట్టణంలో ఎవరైనా అపరిచితులు సంచరిస్తున్నట్లు గుర్తిస్తే పోలీసులకు 9908899617 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరుతున్నారు. కరోనా దృష్టా ప్రతి ఒక్కరు మాస్క్ దరించడం, సామాజిక దూరం పాటించడం, వాహనాలలో వెళ్లే వారు మాస్క్ తప్పక ధరించి నిబంధనలకు అనుగుణంగా పరిమితంగా ప్రయాణించాలని కోరారు.