మదనపల్లిలో ఎం.పి మిథున్ రెడ్డి పర్యటన

0
127

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
రాజంపేట ఎం.పి మిథున్ రెడ్డి సోమవారం ఉదయం మదనపల్లి మండలంలో పర్యటించారు. కోళ్లబైలు పంచాయతీ కాట్లాటవారిపల్లి మార్గంలో చేనేత కార్మీకుల కోసం నిర్మిస్తున్న చేనేత భవనాన్ని ఎం.పి.ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పి మిథున్ రెడ్డి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ ప్రభుత్వం బి.సి ల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎం.ఎల్.ఎ నవాజ్ బాష, తంభళ్లపల్లి ఎం.ఎల్.ఎ పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి, స్థానిక నాయకులు ఉదయకుమార్, అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.