చిత్తూరు జిల్లాలో భారిగా తగ్గిన కరోనా కేసులు – 472 కేసులు నమోదు

0
234

మనఛానల్ న్యూస్ – చిత్తూరు
చిత్తూరు జిల్లాలో మంగళ వారం కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత రెండు నెలల క్రితం నాటి కేసుల స్థాయికి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకొంది. జిల్లాలో మంగళవారం 472కేసులు నమోదు అయ్యాయి. అందులో అర్బన్ లో 85 కేసులు నమోదు కాగ, రూరల్ లో 387 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో అర్బన్ లో తిరుపతి నగరంలో 28, చిత్తూరులో 20, మదనపల్లిలో 12, శ్రీకాళహస్తిలో 7, నగిరిలో4, పలమనేరు, పుంగునూరులో3 కేసులు చొప్పుననమోదు అయ్యాయి.రూరల్ విషయానికి వస్తే తిరుపతి రూరల్ లో 30, పీలేరులో 21, పుంగనూరు,బైరెడ్డిపల్లి,వి.కోట మండలాలో 14చొప్పున, సోమలలో12, ఎస్.ఆర్.పురం, కుప్పం మండలాలో 11 చొప్పున కేసులు నమోదు కాగ, మిగిలిన మండలాల్లో 10లోపు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిమ్మనపల్లి, నిండ్ర, పిచ్చాటూరు, పలమనేరు మండలాల్లో గత 24 గంటలలో ఏలాంటి కరోనా కేసులు నమోదు కాకపోవడం విశేషం.