తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు షెడ్యూలు విడుదల

0
210

మనఛానల్ న్యూస్- హైదరబాద్
కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి మెల్ల మెల్లగా బయటపడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తెలంగాణలో 2021-22 విద్యాసంవత్సారనికి సంబంధించిన వివిధ ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి ప్రణాళిక సిద్దం చేసింది. ఇందులో భాగంగా వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు.
ఎంసెట్ – ఆగస్టు 5 నుంచి 9 వరకు‌
ఈసెట్ – ఆగస్టు 3న
పీఈ సెట్‌ – ఆగస్టు 11-14 వరకు
ఐసెట్ – ఆగష్టు 19,20 తేదీల్లో
లాసెట్ – ఆగష్టు 23న తేదీన
ఎడ్ సెట్ – ఆగష్టు 24, 25 తేదీల్లో
పాలీసెట్ – జూలై 17వ తేదీన నిర్వహించనున్నారు.

జులై 1వ తేదీ నుంచి 8వ తరగతి ఆపై విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించి ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు(1-7వతరగతి)ఆన్ లైనం విధానంలో క్లాసులు నిర్వహించాలని భావిస్తున్నారు.