సి.ఎం.జగన్ ను కలిసిన గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎం.ఎల్.సి కల్పలతరెడ్డి

0
174

మనఛానల్ న్యూస్ – అమరావతి
ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ను శుక్రవారం గుంటూరు-కృష్ణా జిల్లాల ఎం.ఎల్.సిగా నూతనంగా ఎన్నికైన టి.కల్పలతా రెడ్డి మరాద్యపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సి.ఎం.ను కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఎం.ఎల్.సి కల్పలతను ప్రత్యేకంగా అబినందించారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడ నూతన ఎం.ఎల్.సిని అభినందించారు. నూతన ఎం.ఎల్.సి టి.కల్పలతరెడ్డి రాష్ట్ర మంత్రులు పెద్దిరామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్ లతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె వెంట ఏపి ఎస్.సి.ఇ.ఆర్.టి డైరక్టర్ బండపల్లి ప్రతాప్ రెడ్డి, రూరల్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షులు బండపల్లి మదన్ మెహన్ రెడ్డిలు ఉన్నారు.


ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ తో నూతన ఎం.ఎల్.సి కల్పలతా రెడ్డి….. చిత్రంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎస్.సి.ఈ.ఆర్.టి డైరక్టర్ ప్రతాప్ రెడ్డి ,
రూరల్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షులు బండపల్లి మదన్ మెహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో నూతన ఎం.ఎల్.సి కల్పలతా రెడ్డి….. చిత్రంలో రూరల్ అగ్రికల్చర్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షులు బండపల్లి మదన్ మెహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని సన్మానిస్తున్న ఎస్.సి.ఈ.ఆర్.టి డైరక్టర్ ప్రతాప్ రెడ్డి చిత్రంలో నూతన ఎం.ఎల్.సి కల్పలతా రెడ్డి తదితరులు ఉన్నారు.