ఎయిమ్స్ లో చేరిన అమిత్ షా

0
210

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా బారి నుంచి ఇంకా భయటపడలేదు. మంగళవారం తెల్లవారుజామున అమిత్ షా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుకొంటున్నారు. ఆయన ఆగష్టు2వ తేదిన తనకు కరోనా వ్యాధి సోకినట్లు ట్విట్టర్ లో ప్రకటించి గురుగ్రామ్ వేదాంత ఆసుపత్రిలో చేరి ఆగష్టు14వ తేదిన కోలుకొని ఇంటికి చేరుకొన్నారు. అయితే అమిత్ షాకు కరోనా తగ్గక ఒళ్లు నోప్పులు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో మంగళవారం తెల్లవారుజామున 2గంటల వేళ ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ఈయన ఆరోగ్యపరిస్థితిని ఎయిమ్స్ డైరక్టర్ డాక్టర్ రణధీప్ గులేరియా ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.