సోమవారం ప్రధాన వార్తలు @ manachannel.in

0
364

మనఛానల్ న్యూస్ – నేషనల్ డెస్క్

 • జమ్ము లోని బారముల్లా ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ మరణించారు.
 • దేశ వ్యాప్తంగా ఆగష్టు16 నాటికి దేశవ్యాప్తంగా 3,00,41,400 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ సోమవారం ప్రకటించింది.ఒక్క ఆదివారం నాడే 7,36,697 పరీక్షలు జరపడం విశేషం.
 • ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయన వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ తీసుకొంటున్నారు.
 • జె.ఇ.ఇ.మెయిన్స్, ఎన్.ఇ.టి -2020 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
 • కరోనా వ్యాధిలో తిరుపతిలో ఓ సబ్-ఇన్స్ పెక్టర్ సోమవారం మరణించారు.
 • తిరుపతి మాజీ ఎం.పి. పరసారత్నం సతీమణి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు.
  పశ్చిమబెంగాల్ లో ఎం.ఎల్.ఎ సమరేశ్ దాస్ కరోనాతో మరణించారు.
 • వరంగల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరంగల్,హన్ముకొండ ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి . మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ప్రభుత్వం సహాయక చర్యలు మమ్మురంగా నిర్వహిస్తున్నారు.
 • ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోటలోని షార్ లో పలువురు ఉద్యోగులు, శాస్త్రవేత్తలకు కరోనాసోకడంతో షార్ లో లాక్ డౌన్ విధించారు.
 • ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు ఎస్.పి బాలసుబ్రమణ్యం ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన వారం రోజులలో ఆరోగ్యం నయమై ఆసుపత్రి నుంచి డిశార్జ్ అవుతారని ఎస్.పి కుమారుడు చరణ్ సోమవారం వెల్లడించారు.
 • భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 26లక్షలు దాటిపోయాయి. అలాగే మరణాల సంఖ్య కూడ 50వేలుకు చేరుకొంది.మెుత్తం కరోనా కేసుల సంఖ్య 26,47,663 కాగా అందులో 6,76,900 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగ, 19,19,842 వ్యాధి నయమై ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయ్యారు. మరణాలు 50921గా నమోదు అయ్యాయి. ఆదివారం నాడు దేశ వ్యాప్తంగా 7,31,697 మంది నుంచి శాంపిల్స్ తీసుకొన్నారు.
 • టిక్ టాక్ ను నిషేదించిన అమెరికా త్వరలో ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ ఆలీబాబా మీద నిషేధం విధించేందుకు సిద్దమైంది. ఇందుకు అన్నిరకాల చర్యలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొన్నారు.
 • దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతంగా ఉన్న తరుణంలో పలు జాతీయ విద్యా పోటీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులు పలువురు విద్యార్థులు పిిటిషన్ దాఖలు చేశారు. దీనిని సుప్రీం సోమవారం విచారణ చేయనుంది.
 • దేశవ్యాప్తంగా 11రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలు కారణంగా జనజీవనం తీవ్రంగా స్థంభించింది. దీంతో 11 రాష్ర్టాల్లో కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా 868 మంది ప్రాణాలు కోల్పోయార‌ని మంత్రిత్వ శాఖ నివేదిక‌లో వెల్ల‌డించింది.ఆగ‌స్టు 18న మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని దీని వ‌ల్ల రాజ‌స్తాన్, ఉత్త‌రాఖండ్, పంజాబ్ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.