దేశ వ్యాప్తంగా నిరాడంబరంగా 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

0
122

మనఛానల్ న్యూస్ – నేషనల్ న్యూస్
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు సాదసీదగా, నిరాడంబరంగా జరుపుకొన్నారు. ప్రధాని నరేంద్రమోడి ఎర్రకోటలో జాతీయజెండాను ఎగరవేసి దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించారు. భవిష్యత్ లో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ప్రజలు స్వయం సంవృద్ధి సాధించలేకపోతున్నారని అన్నారు. కరోనా కారణంగా వేడుకలు నిర్వహించిన ప్రాంతంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.


ఏపిలో నిరాడంబరంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏపిలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధి స్టేడియంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా సమగ్ర అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని అన్నారు.