మదనపల్లి సబ్ కలెక్టర్ గా ఎం. జాహ్నవి బాధ్యతల స్వీకరణ

0
173

మనఛానల్ న్యూస్-మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి 161వ సబ్ కలెక్టర్ గా తాజా ఐ.ఎ.ఎస్ అధికారిణి ఎం.జాహ్నవి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సివిల్ సర్వీస్ లో శిక్షణ అనంతరం ఆమెను తొలిసారిగా మదనపల్లి సబ్ కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. ఈమె ముస్సోరిలోని ఐ.ఎ.ఎస్ శిక్షణ అనంతరం అనంతపురం జిల్లాలో పలు చోట్ల వివిధ శాఖలలో శిక్షణ తీసుకొన్నారు. తొలి పోస్టింగ్ ను మదనపల్లి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టర్ జాహ్నవి మాట్లాడుతూ తొలి ఉద్యోగం దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిజన్ అయిన మదనపల్లిలో నియమింపబడడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరి సహకారంతో పరిపాలనను విజయవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా అందరికీ ఇండ్లు, రేషన్ కార్డ్స్, పెన్షన్ లు మొదలగు ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేయడం జరుగుతుందని, స్పందన కార్యక్రమంలో వచ్చే వివిధ రకాల ప్రజల సమస్యలతో పాటు భూ సమస్యలను సత్వరంగా పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో పనిచేసి వెళ్ళిన సబ్ కలెక్టర్ లు, ఆర్డీఓలు, చేసిన విధానాలు అనుసరిస్తూ పనిచేయడం జరుగుతుందని తెలిపారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించే ముందు ఆమె బోయకొండ దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారి ఆశ్వీరాదం తీసుకొన్నారు. సబ్ కలెక్టర్ జాహ్నవిని డివిజనల్ లోని పలువురు తాహిశీల్లార్లు కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.