కాంగ్రెస్ మద్దతుతో మాజీ ప్రధాని దేవేగౌడ మళ్లీ రాజ్యసభకు

0
62


మనఛానల్ న్యూస్ – బెంగళూర్
లో బిజెపి పరుగులకు జెడిఎస్ ద్వారా బ్రేకులు వేయాలని కర్నాటక కాంగ్రెస్ పార్టీ ఉబలాటపడుతోంది.ఇందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి రాజ్యసభకు ఎంపిక అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దక్షణాదిలో బిజెపి బలాన్ని తగ్గించాలనే కాంగ్రెస్ ప్రయత్నంలో భాగంగా జె.డి.ఎస్ దళపతికి తమ మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. కర్నాటకలో అధికారంలోనున్న బిజెపి ప్రాబల్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించి, భవిష్యత్ లో ఎదగకుండ చేయాలని ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నేతలు వ్యూహా రచన చేస్తున్నారు.